WD
అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..? పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు.
కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా అవతారమెత్తి తన శరీరాన్ని 18 ముక్కలుగా విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలో భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.
అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం "శ్రీ శాంకరీ దేవి పీఠం" శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పండితులు అంటున్నారు. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.
శ్రీ పురుహుతికా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు.
కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.
శ్రీ శృంఖళా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. ఇది బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని చెబుతారు. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.
ఇక అష్టదశ పీఠాల్లో ముఖ్యమైన శ్రీ చాముండేశ్వరీ దేవి పీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడినట్లు ఆలయ పురాణాల ద్వారా తెలిసింది. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది "శ్రీ కామాక్షీ దేవి" క్షేత్రం. ఇది తమిళనాడు, కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.
ఇక అష్టాదశ పీఠాల్లో ఆరోది శ్రీ మహాలక్ష్మీ దేవి ఆలయం. ఈ పీఠం మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
అలాగే ఏడో అష్టాదశ పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. అమ్మవారి దంతపంక్తి పూర్వం హలంపురం అని పిలుపబడే అలంపురంలో పడిందని పండితులు చెబుతున్నారు. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.
No comments:
Post a Comment